అన్నదాతలకు కేంద్రప్రభుత్వం ఊరట కల్పించింది. ఎరువులను విక్రయించే కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎరువుల ధరలు పెంచవద్దని ఆదేశించింది. యూరియా మినహా ఇతర ఎరువులను పాత ధరలకే విక్రయించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్‌కు ముందే డీపీఏ కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు నిర్ణయించిన నేపథ్యంలో కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా పొటాష్, ఫాస్ఫేట్ ధరలు పెరగడంతో ఎరువుల ధరలను కంపెనీలు దాదాపు 58 శాతం అంటే మూడింతల వరకు పెంచేశాయి. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఎరువుల ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement