దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు, కరోనా మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎక్కువ మంది వ్యాక్సిన్ సెంటర్లకు తరలి వెళ్తున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన విధంగా వ్యాక్సిన్ ఉత్పత్తి లేకపోవడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు అందించి అక్కడి నుంచి కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు కేంద్రం కసరత్తులు చేపట్టింది.
కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర కంపెనీలకు అందించే విషయంలో కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర కంపెనీలు కూడా వ్యాక్సిన్ ఉత్పత్తిలో భాగస్వామ్యమైతే డిమాండ్‌కు తగిన విధంగా వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతుంది. దేశంలో వేగంగా వ్యాక్సిన్‌ను అందించేందుకు అవకాశం ఉంటుంది.