కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తున్న వేళ వ్యాక్సినేషన్ ఒక్కటే కేంద్ర ప్రభుత్వానికి ఆశాకిరణంలా కనిపిస్తోంది. టీకాల ఉత్పత్తిని మరింత ముమ్మరం చేయాలని కరోనా వ్యాక్సిన్ ప్రధాన ఉత్పత్తిదారులైన సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలను కోరింది. రెండు సంస్థలకు భారీగా రుణాలు మంజూరు చేసింది. సీరమ్ సంస్థకు రూ.3 వేల కోట్లు, భారత్ బయోటెక్ సంస్థకు రూ.1,500 కోట్లు రుణం అందించింది. హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరిట వ్యాక్సిన్ అభివృద్ధి చేయగా, ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ టీకా కొవిషీల్డ్ ను సీరమ్ భారత్ లో ఉత్పత్తి చేస్తోంది. మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించలేని పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయించుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement