Friday, November 22, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి నోటిఫికేషన్.. భగ్గుమన్న కార్మిక సంఘాలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. కన్సల్టెంట్‌ నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ అమ్ముతామని కేంద్రం పేర్కొంది. ఈ బిడ్లకు సంబంధించిన అప్లికేషన్లను బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఈనెల 15న ప్రి బిడ్ మీటింగ్ ఏర్పాటు చేసిన కేంద్రం.. ఈనెల 28న దరఖాస్తుకు ఆఖరు తేదీగా నిర్ణయించింది. ఈనెల 29న టెక్నికల్ బిడ్స్ తెరుస్తామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్‌ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మకానికి కేంద్రం పెట్టింది. బిడ్‌లో పాల్గొనేందుకు రూ.లక్ష డిపాజిట్, రూ.కోటి బ్యాంక్‌ గ్యారంటీ చూపాలని పేర్కొంది.

కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనను నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్లాంట్ ఉద్యోగుల వాహనాలను కార్మిక సంఘాలు అడ్డుకుంటున్నాయి. దీంతో వాహనదారులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ వార్త కూడా చదవండి: కేబినెట్‌లో ఏపీకి మొండిచేయిపై టీడీపీ నేత సెటైర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement