Saturday, November 23, 2024

చెక్ చేసుకోండి.. రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రధాని మోదీ రూ.19,000 కోట్ల నిధులు విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9.5 కోట్ల మంది రైతులకు వర్తించేలా నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా ఒక్కోరైతు ఈ విడతలో రూ.2,000 అందుకోనున్నారు. రైతుల ఖాతాల్లో రూ.2వేలు క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి https://pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Beneficiary Statusపై క్లిక్ చేయాలి. 8వ విడత వస్తే ఆ బాక్స్ కింద వివరాలు చూపిస్తుంది.

కాగా ఈసారి పీఎం కిసాన్ పథకం ద్వారా పశ్చిమ బెంగాల్ రైతులు కూడా లబ్ది పొందనున్నారు. కేంద్రం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా మూడు విడతల్లో నగదు సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. శుక్రవారం నాడు నగదు విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ఏపీకి చెందిన రమ అనే మహిళా రైతుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బంజరు భూములను సాగులోకి తీసుకువచ్చి రైతాంగానికి స్ఫూర్తిగా నిలిచారని మోదీ కొనియాడారు. అందుకు రమ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ప్రభుత్వం ద్వారా లభించిన 4 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం ద్వారా విభిన్నరకాల పంటలు పండించి లాభాలు ఆర్జించానని రమ వెల్లడించారు. ఆమె విజయగాథను విన్న ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement