Sunday, November 24, 2024

మేం పన్నులు తగ్గిస్తే మీరేం చేస్తారు?: టెస్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రశ్న

భారత్‌లో విద్యుత్ కార్లను ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ కంపెనీ టెస్లా ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు సుంకాలు, పన్నులను తగ్గిస్తే భారత్‌లో విద్యుత్ కార్లను తయారు చేస్తామంటూ టెస్లా సీఈవో కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థను పలు విషయాలపై స్పష్టత కోరింది. పన్నులు తగ్గించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్న కేంద్రం.. ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికల గురించి సంస్థను ఆరా తీసినట్టు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది.

ఏం చేయదలచుకున్నారో సవివరంగా చెప్పాలంటూ టెస్లాను కోరిందంటున్నారు. అంతకన్నా ముందు స్థానికంగా వాహనాల సమీకరణలో వేగం పెంచాల్సిందిగా సూచించిందని తెలుస్తోంది. గత సమావేశంలోనే ఈ వివరాలను టెస్లాకు కేంద్రం తెలియజేసిందని ఆ అధికారి చెబుతున్నారు. పూర్తిగా తయారు చేసిన కార్లు లేదా సగం తయారు చేసి.. మిగతా సగాన్ని భారత్ లో అసెంబుల్ చేసే దానిపైనా అభిప్రాయం చెప్పాల్సిందిగా టెస్లాకు సూచించారని అంటున్నారు. దాని వల్ల దిగుమతి సుంకం తగ్గుతుందని చెప్పినట్టు సమాచారం. దీనిపై టెస్లా నుంచి స్పందన రావాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: శ్రావణ మాసం వేళ మగువలకు బ్యాడ్ న్యూస్

Advertisement

తాజా వార్తలు

Advertisement