Monday, November 18, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదు: కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నా.. పలు రాజకీయ పార్టీలు లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సోమవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి భగవత్ కృష్ణారావు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.

కాగా మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా జరుగుతున్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రారంభమైన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేసింది. కొత్త పరిశ్రమల్ని ఇవ్వకుండా ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్‌పరం చేయడం దారుణమని ఉక్కు పరిరక్షణ సమితి నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ట్రాక్టర్ ఎక్కి పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ

Advertisement

తాజా వార్తలు

Advertisement