పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పెగాసస్ స్పైవేర్ అంశం తీవ్రంగా కుదిపేసింది. ఈ నేపథ్యంలో పెగాసస్ స్పైవేర్‌పై రాజ్యసభలో కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. పెగాసస్ స్పైవేర్‌పై దాని తయారీ సంస్థ NSOతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. NSOతో ప్రభుత్వ లావాదేవీలపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు.. రక్షణ మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.
అయితే, నిఘా, ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ వినియోగం గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా NSO అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్‌తో భారత్ సహా పలు దేశాలు ప్రముఖుల ఫోన్‌లపై నిఘా పెట్టినట్లు ఇటీవల సంచలన కథనాలు వెలువడ్డాయి. ఈ స్పైవేర్ వల్ల ఎఫెక్ట్ అయిన జాబితాలో భారత్‌కు చెందిన 300 మంది ఉన్నారని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సీబీఐ అధికారులు, జర్నలిస్టులు, పలువురు హక్కుల కార్యకర్తల ఫోన్‌లను హ్యాక్ చేసినట్లు పలు కథనాలు వచ్చాయి.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు: రేవంత్