Tuesday, November 19, 2024

తెలంగాణ విద్యాశాఖకి కేంద్ర విద్యాశాఖ లేఖ

తొలి క్వార్టర్ నిధుల కోసం ఇటీవల కేంద్ర విద్యాశాఖకు రాష్ట్ర విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే ఈరోజు కేంద్ర విద్యాశాఖ తెలంగాణ విద్యాశాఖకి లేఖ రాసింది. సమగ్ర శిక్షా అభియాన్ నిధుల కోసం పంపిన డాక్యుమెంట్లలో లోపాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. 2022, 20-23 ఏడాదికి సమగ్ర శిక్షా అభియాన్ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్రం డ్యాక్యుమెంట్ల మిస్సింగ్ తో పాటు పలు తప్పులు ఉన్నాయంటూ తిప్పి పంపింది. 32,694 ఇంటిగ్రేటేడ్ అంగన్వాడీలలో 2,888 అంగన్వాడీలను సరిగా మ్యాపింగ్ చేయలేదని లేఖలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement