Monday, November 25, 2024

దేశంలో రికవరీ రేటు 85.6 శాతానికి పెరిగింది: లవ్ అగర్వాల్

భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని, రికవరీ రేటు పుంజుకుందని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 81.7 శాతం నుంచి 85.6 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 1.8 శాతం మంది కరోనా బారినపడ్డారని, దేశ జనాభాలో 2 శాతం కంటే తక్కువేనని వివరించారు.

24 గంటల్లో రికార్డు స్థాయిలో 4.22 లక్షల మంది కోలుకున్నారని చెప్పారు. గత 3 వారాలుగా 199 జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, 10 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో 50 వేల కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 14.1 శాతంగా ఉందని, మరణాల రేటు 1.1 శాతంగా ఉందని లవ్ అగర్వాల్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement