కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇది కక్ష పూరితం, వివక్ష అంటూ మండి పడ్డారు.. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ పదాన్ని కేంద్రం నిషేధించిదంటూ వ్యాఖ్యానించారు.. కేంద్ర అర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండున్నర గంటల ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు వినిపించినా తెలంగాణ పేరును పలకలేదన్నారు రేవంత్. సబ్ కా సాత్ పెద్ద బోగస్ అంటూ మండిపడ్డారు..వికసిత్ భారత్ లో తెలంగాణ లేదా? అంటూ నిలదీశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర ఆన్యాయంపై చేశారంటూ దీనిపై నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.
కొత్తగా తాము అధికారం చేపట్టిన తర్వాత తాము ఏడు సార్లు ఢిల్లీ పెద్దలను కలిశామని, ప్రధాని మోడీ తానే స్వయంగా మూడు సార్లు కలసి నిధులు కేటాయించవలసిందిగా అభ్యర్ధించానని చెప్పారు సిఎం.. అయినా ఇసుమంతైన కనికరం చూపకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారంటూ వాపోయారు..
ఈ బడ్జెట్ మోదీ తన కుర్చి కాపాడుకునే బడ్జెట్ లా ఉందని అన్నారు.. తాము ఎపికి నిధులు,ప్రాజెక్ట్ లు ,పథకాలు ఇవ్వడాన్ని తప్పు పట్టడం లేదని, తమకు ఎందుకు ఇవ్వలేదో అని అడుగుతున్నామన్నారు.. పోలవరానికి నిధులు ఇస్తున్న కేంద్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు నిధులు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు..
సీఎం రేవంత్ ఇంకా ఏమన్నారంటే..
* తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఆలోచన చేయడం లేదు
* కేంద్ర బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్లా ఉంది
* మెట్రోకు నిధుల్లేవు.. ఐటీ కారిడార్ ఊసే లేదు
* అమరావతికి వేల కోట్లు ఇస్తరు.. మెట్రోకు ఇవ్వరా..?
* ఈ బడ్జెట్ క్విడ్ ప్రోకోలా ఉంది
* పోలవరానికి వేలకోట్లు ఇచ్చినప్పుడు పాలమూరు ఏం పాపం చేసింది..?
* విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకివ్వలేదు?
* సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ బీజేపీ బోగస్ నినాదం
* 35 శాతం ఓట్లు, 8 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకు ఇచ్చేది ఇదేనా?
* తెలంగాణ ప్రజలకు బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలి
* కుర్చీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
* అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం వివక్షపై చర్చిస్తాం
* కిషన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి
* కిషన్ రెడ్డి, సంజయ్ బానిసలుగా కాకుండా పౌరులుగా ఆలోచించాలి
* తెలంగాణ నిధుల కోసం 17 మంది ఎంపీలు కలిసి కొట్లాడుదాం