Saturday, January 4, 2025

Central Cebinet : రైత‌న్న‌ల‌కు కేంద్రం వ‌రాలు.. ఎరువుల ధ‌ర‌లు భారీగా త‌గ్గింపు

  • డీఏపీ బ‌స్తా రూ.1350 కే
  • నాలుగు కోట్ల మంది అన్న‌దాతల‌కు ల‌బ్ధి
  • రైతు సాయాన్ని రూ.6 వేల నుంచి ప‌దివేల‌కు పెంపు
  • పంట‌ల‌ బీమాకు కేంద్రం ప్రిమియం


న్యూ ఢిల్లీ – ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ 2025 సంవత్సరంలో తొలిసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీని మరింత పెంచాలని నిర్ణయించింది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై ఒక 50కిలోల డీఏపీ బస్తా రూ.1350కే లభ్యం కానుంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

 దేశవ్యాప్తంగా రైతుల కోసం చేపట్టిన.. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రూ. 69,515 కోట్లకు పెంచినట్లు వివరించారు. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 4కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అంతేగాక పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇక పంట‌ల బీమా కోసం 50శాతం ప్రీమియంను కేంద్రం చెల్లించేందుకు కేబినేట్ అంగీక‌రించింది.. ఈశాన్య రాష్ట్రాల‌కు ఈ ప్రీమియం 90శాతంగా నిర్ణ‌యించారు. అలాగే ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి రూ. 800 కోట్ల కేటాయించినట్లు పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన రైతుల పంటలకు పంట బీమా చెల్లింపు విధానానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ తోడ్పడనుందని కేంద్ర మంత్రి అశ్వినీ సోదాహరణగా వివరించారు.

డీఏపీ ఎరువుల సబ్సీడీకి అదనంగా రూ.3,850 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి గతేడాది వరకు.. అంటే 2024 చివరి వరకు.. ఎరువుల సబ్సీడీ కింద రూ. 11.9 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. అదే విధంగా 2024లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రైతుల కోసం రూ. 6 లక్షల కోట్ల విలువైన 23 కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది.

- Advertisement -

అదేవిధంగా ‘ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ’కి కేంద్రం రూ.800 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించిందిని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణ‌వ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement