న్యూ ఢిల్లీ – దే.శంలో కీలక భద్రతా సంస్థలైన సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్‌లకు కేంద్రం కొత్త చీఫ్‌లను నియమించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా రాజ్విందర్ సింగ్భట్టి నియమితులయ్యారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రాజ్విందర్ సింగ్.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
అలాగే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా దల్జిత్ సింగ్ చౌధరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్బీ డీజీగా కొనసాగుతున్నారు. బీఎస్ఎఫ్ చీఫ్‌గా ఆయన వచ్చే ఏడాది నవంబర్ 30వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతారని కేంద్రం తెలిపింది.
- Advertisement -