ఎక్కువమంది వినియోగించే వెబ్‌బ్రౌజర్ గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. కంప్యూటర్లలో పాతక్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది.
క్రోమ్ బ్రౌజర్‌లో ‘అనేక లోపాల’ కారణంగా మీ కంప్యూటర్‌ను సైబర్ నేరగాళ్లు రిమోట్‌గా యాక్సెస్ చేయొచ్చని పేర్కొంది. గూగుల్ క్రోమ్ విండోస్ వెర్షన్ 118.0.5993.70/.71.. మ్యాక్, లైనక్స్ వెర్షన్ 118.0.5993.70 కంటే ముందు వెర్షన్ల బ్రౌజర్లను వినియోగిస్తున్న వారికి ఈ ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ తెలిపింది.
ఆయా బ్రౌజర్లలో లోపాల కారణంగా రిమోట్‌గా దాడి చేసే వ్యక్తి.. సిస్టమ్‌లోకి ఆర్బిట్రరీ కోడ్‌లను జొప్పించడం, సర్వీస్‌లను తిరస్కరించడం, లక్షిత సిస్టమ్‌లలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టే ప్రమాదం ఉందని సెర్ట్‌ఇ్ఖన్ తన హెచ్చరికల్లో పేర్కొంది. కాబట్టి వెంటనే గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.