న్యూఢిల్లీ – అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామ మందిరంలోని గర్భగుడిలో రామ్‌లాలా కొత్త విగ్రహం ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అన్ని కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్ హాలీడే వర్తించనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు హాఫ్ హాలీడే ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోనున్నాయి.. కాగా, అయోధ్యలో జరిగే రాంలల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement