Friday, November 22, 2024

ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహం.. ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రైతులు పండించిన పంటలు, ఇతర ఉత్పత్తులకు మెరుగైన ధరలు అందించడంతో పాటు మార్కెటింగ్ చేయడం కోసం రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్-ఎఫ్పీఓ) ఏర్పాటు చేసేందుకు 2020లో ఒక పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ.. దేశంలో మొత్తం 10 వేల ఎఫ్.పీ.ఓల ఏర్పాటు లక్ష్యంతో రూ. 6,865 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వెల్లడించింది.

ఈ పథకం ప్రకారం మూడేళ్ల కాలంలో ఒక్కొక్క ఎఫ్.పీ.ఓ రూ. 18 లక్షల మేర ఆర్థిక సహాయాన్ని పొందుతుందని చెప్పింది. అలాగే అదనంగా మ్యాచింగ్ గ్రాంట్ కింద ఎఫ్.పీ.ఓలోని రైతు సభ్యులు ఒక్కొక్కరికి రూ. 2 వేలు పరిమితితో రూ. 15 లక్షల వరకు క్రెడిట్ గ్యారంటీ సదుపాయం కూడా ఉందని తెలియజేసింది. అలాగే క్రెడిట్ యాక్సెసబిలిటీని నిర్థారించి, అర్హత కల్గిన రుణ సంస్థల నుంచి రూ. 2 కోట్ల మేర ప్రాజెక్టు రుణాలు కూడా అందజేయవచ్చునని సమాధానంలో పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement