పద్మ అవార్డుల అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.. అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని సీఎం యోచిస్తున్నారు.
గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మ భూషణ్), అండేశ్రీ (పద్మ భూషణ్), గోరేటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులకు పద్మ పురస్కారాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు.
వివిధ రంగాలలో వారు గణనీయమైన కృషి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యక్తులను గుర్తించలేదని.. 4 కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణకు… ప్రకటించిన 139 అవార్డుల్లో కనీసం 5 అవార్డులు కూడా ఇవ్వలేదని అన్నారు.