Tuesday, November 26, 2024

సింహగిరి అభివృద్ధికి కేంద్రం సహకారం : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

బీచ్ రోడ్ : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పెట్టుబడుల సదస్సులో పాల్గొనడానికి నగరానికి వచ్చిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బా నంద్ సోనోవాల్ ను శనివారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయము సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు మర్యాదపూర్వకంగా కలుసుకొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులకు సింహాద్రినాథుడు జ్ఞాపికలు శ్రీనుబాబు బహుకరించారు. సింహగిరి ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి మరింత తోడ్పాటును అందించాలని శ్రీను బాబు కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ప్రసాద్ స్కీం కింద 54 కోట్లు నిధులు కేంద్రం మంజూరు చేసినట్లు చెప్పారు. వీలైనంత త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కూడా కేంద్ర మంత్రి సూచించారు. రెండో విడత కూడా మరింతగా నిధులు మంజూరు చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. కేంద్ర పోర్ట్ లు, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్భానంద్ సోనో వాల్ ను సత్కరించిన శ్రీను బాబు మాట్లాడుతూ.. డాక్ లేబర్ బోర్డ్ నుంచి పోర్ట్ లో విలీనమైన 347 క్యాజువల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. గతంలో కూడా ఇదే విషయం పలుమార్లు విన్నవించినట్లు శ్రీను బాబు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement