మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం 22 వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వనుంది. తక్కువ ధరకే వంట గ్యాస్‌ను సరఫరా చేస్తున్నందుకు ప్రభుత్వం ఈ మొత్తాన్ని మూడు కంపెనీలకు ఇవ్వనుంది. కేంద్ర మంత్రి వర్గ సమావేశంపై దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ చెప్పారు. రెండు సంవత్సరాలుగా ఆయిల్ కంపెనీలు ఉత్పత్తి ధర కంటే తక్కువకే సరఫరా చేస్తున్నాయి.
ఈ 22 వేల గ్రాంట్‌ను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ), భారత్ ప్రెటోలియం కార్పోరేషన్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ (హెచ్‌పీసీఎల్)కు ఇవ్వనుంది. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా దేశంలో రెండు సంవత్సరాలుగా గ్యాస్ రేట్లను సమరించడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ఆయిల్ కంపెనీలు గృహ అవసరాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయి. దీని ఇల్ల చమురు సంస్థలకు భారీగా నష్టాలు వస్తున్నాయి.