Friday, November 22, 2024

Big Story | సబ్సిడీలపై భారీగా కోతపెట్ట‌నున్న కేంద్రం.. ఆహార, ఎరువులపై 3.7 లక్షల కోట్లు తగ్గించే ప్లాన్

ఆహార, ఎరువుల సబ్సిడీని 3.7 లక్షల కోట్ల మేర తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కాలంలో ద్రవ్యలోటు భారీగా పెరగడంతో సబ్సిడీలను కుదించాలని భావిస్తున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మొత్తం దేశ బడ్జెట్‌ 39.45 లక్షల కోట్లలో ఆహార, ఎరువుల సబ్సిడీనే 8వ వంతు ఉన్నాయి. రానున్న ఆర్ధిక సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆహార సబ్సిడీ 2.3 లక్షల కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎరువుల సబ్సిడీ 1.4 లక్షల కోట్ల ఉండే అవకాశం ఉందని సీనియర్‌ అధికారులు తెలిపారు. కొవిడ్‌ సమయంలో ఉచిత బియ్యం పంపిణీతో ఆహార సబ్సిడీ భారీగా పెరిగిందని ఆ అధికారి వివరించారు. ఎరువులు, ఆహార సబ్సిడీలను తగ్గిస్తే రాజకీయ దుమారం చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

- Advertisement -

2024 ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం నిజంగానే ఈ రెండు సబ్సిడీలను భారీగా కోత విధిస్తుందా అన్నది అనుమాన మే. అధికారులు మాత్రం దీనిపై బడ్జెట్‌లో ప్రతిపాదించేందుకు నిర్ణయించారు. రానున్న ఆర్ధిక సంవత్సరంలో 6.4 శాతం ఆర్ధిక వృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు కోసం ద్రవ్యలోటును భారీగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే సబ్సిడీలపై కోత విధించాలని ఆలోచిస్తోంది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ముడి చమురు ధరలు తగ్గుతున్నందున ఎరువుల సబ్సిడీలు సహజంగానే కొంత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement