Saturday, November 23, 2024

విండ్‌పాల్‌ పన్ను తగ్గించిన కేంద్రం..

ప్రెటోల్‌, డీజిల్‌ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన విండ్‌పాల్‌ పన్నును తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రిటైల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. జులై 1 నుంచి ప్రభుత్వం విండ్‌పాల్‌ ట్యాక్స్‌ విధించింది. 15 రోజులకు ఒకసారి దీన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. పెట్రోల్‌పై లీటర్‌కు 6 రూపాయలు విండ్‌పాల్‌ పన్ను విధించిన ప్రభుత్వం దాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేసింది. డీజిల్‌పై 12 రూపాయలు ఉన్న పన్నును 10 రూపాయలకు తగ్గించారు. విమాన ఇంధనంపై లీటర్‌కు 6 రూపాయలుగా ఉన్న స్పెషల్‌ అడిషినల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని 4 రూపాయలకు తగ్గించారు.

దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ముడి చమురుపై ఉన్న విండ్‌పాల్‌ పన్నును టన్నుకు 23,250 నుంచి 17,000కు తగ్గించారు. ప్రత్యేక ఎకనామిక్‌ జోన్‌లో ఉత్పత్తి అవుతున్న పెట్రోల్‌, డీజిల్‌, ఏవిషయేషన్‌ ఇంధనంపై పన్నులను పూర్తిగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్‌లో రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, వేదాంత కంపెనీల షేర్లు లాభపడ్డాయి. జూన్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 122.3 డాలర్లుగా ఉంటే, ప్రస్తుతం ఈ ధర 107 డాలర్లకు పడిపోయింది. ఓఎన్‌జీసీ ఒక బ్యారెల్‌ చమురుపై 25 డాలర్లు, రిలయన్స్‌ 13 డాలర్ల లాభాలను ఆర్జిస్తున్నాయని మార్కెట్‌ నిపుణులు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement