దేశంలో సరిపడా ముడి చమురు నిలలు ఉంటాయని, నిలలపై కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పెట్రోలియం శాఖ ప్రకటించిన నేపథ్యంలో.. మార్కెట్లకు కలిసి వచ్చాయి. ఇతర దేశాల నుంచి వచ్చే సరఫరాలోనూ ఎలాంటి సమస్యలు తలెత్తవని కేంద్రం ప్రకటించడం కూడా సానుకూల అంశమే.. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మొత్తం అధికార పార్టీ ఎన్డీయే కూటమికే అనుకూలంగా ఉన్నాయి. ఇది కూడా మార్కెట్లను లాభాలవైపు పరుగులు పెట్టేందుకు దోహదపడ్డాయి. కీలకమైన యూపీలో మళ్లి బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెప్పాయి.
యుద్ధం కారణంగా దేశీయ దిగ్గజ కంపెనీలు రిలయన్స్, టాటా మోటార్స్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి. కనిష్టాలకు చేరుకున్నాయి. దీంతో మదుపరులు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. అమెరికా ఫెడ్ తీసుకున్న నిర్ణయం కూడా పాజిటివ్ అయ్యింది. కరోనా ఉద్దీపనల ఉప సంహరణలో భాగంగా.. వడ్డీ రేట్లను వేగంగా పెంచాలని నిర్ణయించిన ఫెడ్, వెనుకడుగు వేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తామని ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..