ఓవర్సీస్ బెట్టింగ్ కంపెనీల సర్రోగేట్ ప్రకటనలను ప్రదర్శించవద్దని భారతదేశం గూగుల్‌ను కోరిందని, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత వారం ఆల్ఫాబెట్ ఇంక్ యొక్క గూగుల్ ఇండియాకు పంపిన లేఖలో ఫెయిర్‌ప్లే, పరిమ్యాచ్, బెట్‌వే ఇన్ సెర్చ్ రిజల్ట్స్, యూట్యూబ్ వంటి బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి డైరెక్ట్ లేదా సర్రోగేట్ అన్ని ప్రకటనలను తక్షణమే తొలగించాలని కంపెనీని కోరినట్లు నివేదిక పేర్కొంది. నైపుణ్యంతో కూడిన గేమ్‌లను మాత్రమే నియంత్రించి, అవకాశాల ఆటలను వదిలివేయాలనే ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించిన తర్వాత ఆన్లైన్ గేమింగ్‌పై భారతదేశ ప్రణాళికాబద్ధమైన నియంత్రణ అన్ని రియల్-మనీ గేమ్‌లకు వర్తిస్తుంది.
”అక్టోబర్ 3న మా చివరి సలహా తర్వాత, టీవీ ఛానెల్‌లు, ఓటీటీ ప్లేయర్లు ఆన్లైన్ బెట్టింగ్ సంస్థల సర్రోగేట్ ప్రకటనలను చూపడం మానేశాయి. అయితే యూట్యూబ్, గూగుల్ ఇటువంటి అనేక ప్రకటనలు కొనసాగిస్తునట్లు మా దృష్టికి వచ్చింది. దీన్ని తక్షణమే నిలిపివేయాలని మేము గూగుల్‌ను కోరాము”అని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా దీనిపై గూగుల్ ఇంతవరకు స్పందించలేదు.