దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు.
షార్ లో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు ఆమోదం…
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ను నిర్మించనున్నారు. ఎన్డీఎల్వీ ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎన్డీఎల్వీ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.
- Advertisement -