నటుడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఓ చిత్రంలో రజనీ రాజకీయరంగ ప్రవేశంపై విమర్శలు చోటు చేసుకున్నాయి. దీంతో సెన్సార్ బోర్డు ఆ చిత్రంపై వేటువేసింది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘అడంగాదే’. ఈ చిత్రానికి షణ్ముఖం ముత్తుస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధం కావడంతో ఇటీవల సెన్సార్ సభ్యులకు ప్రదర్శించారు. అయితే సినిమాలో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి పలు విమర్శలు చోటుచేసుకోవడంతో ఆయన తరఫున ఈ చిత్రంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దీంతో సెన్సార్ బోర్డు అడంగాదే చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. చిత్ర వర్గాలు రివైజింగ్ కమిటీకి వెళ్లారు. అక్కడ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై విమర్శలకు సంబంధించిన 100 సన్నివేశాలతో కూడిన పది నిమిషాలు నిడివిని కట్ చేసి చివరికి చిత్రానికి సర్టిఫికెట్ అందించారు.