Tuesday, November 26, 2024

సెల్‌ఫోన్‌ కంటైనర్‌ చోరీ.. ఇద్దరు అంతర్రాష్ట్ర స్మ‌గ్ల‌ర్ల‌ అరెస్టు..

కడప క్రైమ్‌, (ప్రభన్యూస్‌) : బ్లూ డార్ట్‌ డెలివరీ కంపెనీ చెందిన కంటైనర్‌ లారీ నుండి భారీ మొత్తంలో మొబైల్‌ ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌ చోరీ చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర ఘరానా నేరస్తులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి ఒక కోటి 58 లక్షల 14 వేల 789 రూపాయల విలువైన మొబైల్‌ ఫోన్స్‌ ల్యాప్‌టాప్స్‌, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపిన వివరాల ప్రకారం … హర్యానా బిలాస్పూర్‌ నుంచి చెన్నైకి అక్టోబర్‌ 19న బయలుదేరిన కంటైనర్‌ లారీ కడప నగరం చిన్న చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బైపాస్‌ రోడ్‌లోని కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు సమీపంలో చోరీకి గుర‌య్యింది. మొబైల్‌ కంటైనర్‌ లారీని తాళాలు పగలగొట్టి , అందులోని కోటి 68 లక్షల 58 వేల 671 విలువైన మొబైల్‌ ఫోన్లు లాప్‌టాప్‌లు ఇతర విలువైన ఎలక్ట్రాక్ర్‌ వస్తువులను దోచుకున్నారు.

ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్‌ను గుర్తించి తద్వారా ముద్దాయిలు చోరీ సొత్తును కలిగిన ఇన్నోవా వాహనం నుంచి మరొక వాహనంలోకి మార్చినట్లుగా గుర్తించారు, ఈ కేసులో అంతర్రాష్ట్ర నేరస్తులైన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రాచనహళ్లి చెందిన సల్మాన్‌ మన్సూర్‌ అహ్మద్‌తో పాటు మహమ్మద్‌ రెహమాన్‌ షరీఫ్‌ అనే నేరస్తుని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు, అరెస్ట్‌ చేసిన వీరి వద్ద నుంచి 1,557 రెడ్మీ మొబైల్‌ ఫోన్లు, మూడు ఆపిల్‌ ఐఫోన్లు, ఐదు లాఎ్టాప్‌లు, 193 ఇయర్‌ ఫోన్‌ బ్లూటూత్‌లు, ఒక ఆడి, ఇన్నోవా వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు, వీటి విలువ సుమారు ఒక కోటి 58 లక్షల 14వేల 789 రూపాయలు ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement