Friday, September 20, 2024

Vinesh Phogat | వినేశ్‌కు అండగా ప్ర‌ముఖుల పోస్టులు…

పారిస్‌ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌ పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం భారత అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై మరో స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా స్పందిస్తూ వినేశ్‌కు అండగా నిలిచాడు. ఆమె కోసం ప్రపంచమంతా ప్రార్థిస్తోందని అన్నాడు.

వినేశ్‌కు ధైర్యం చెబుతూ ప్రముఖుల పోస్టులు…

‘‘ప్రజలకు నిజమైన ఛాంపియన్‌గా ఉండటానికి కొన్ని సార్లు మీకు బంగారు పతకమే అవసరం లేదు’’ – ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత, మాజీ షూటర్‌ అభినవ్‌ బింద్రా

‘‘మాకు నువ్వెప్పటికీ ఛాంపియన్‌వే. ఎల్లప్పటికీ మద్దతుగా ఉంటా’’ – స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు
“వినేశ్ ఫోగ‌ట్ పై అన‌ర్హ‌త వేటు వేయ‌డం షాకింగ్‌గా ఉంది. అనర్హత వేటు విషయాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. ‘యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌’ దృష్టికి తీసుకెళ్లింది.” – పీటీ ఉష

‘‘ఇది చాలా దురదృష్టకరం. దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వద్ద భారత్‌ తమ నిరసనను బలంగా వినిపించాలి’’ – టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌

- Advertisement -

”ఎంతగానో పోరాడే వ్యక్తులు కఠినమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. కష్టాల మధ్య కూడా నిలదొక్కుకునే మీ అద్భుతమైన ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీ కష్టసుఖాల్లో మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం” – సమంత

”మీరు మా హృదయాలు గెలుచుకున్నారు. మీరు ఏదైతే సాధించారో, నిలబడిన తీరు రానున్న తరాలకు స్ఫూర్తినిస్తుంది” – ప్రకాశ్‌ రాజ్‌

”మీరు ఎలాంటి బాధను ఎదుర్కొంటున్నారో ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంది. మీరు ఎప్పటికీ ఛాంపియనే” – సోనాక్షి సిన్హా

‘‘నీ ప్రతిభతో స్వర్ణ పతకాన్ని మించిన పేరు సాధించావు” – తాప్సీ

Advertisement

తాజా వార్తలు

Advertisement