తారల విశేషాలు, వ్యక్తిగత వివరాలు మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరేది. తారల స్టార్‌డమ్ పెంచింది, క్రేజ్ తెచ్చింది ఒక వి ధంగా మీడియా అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ట్రెండ్ మారింది. తారలు చెప్పాల్సిన సంగతులను, అరుదైన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా జనాలకు చేరవేస్తున్నారు. వారిని ఫాలో అవుతున్నవాళ్లు లక్షల్లో ఉంటున్నారు. కొత్త సినిమా కబుర్లు, సరదా సంగతులు, శుభవార్తలు ఏదైన సరే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. అభి మానులకు తారలకు మధ్య ఇవి వారధిలా ఉన్నాయి. దీనివల్ల ఎప్పటికప్పుడు సరైన సమాచారం చేరుతోంది. అంతేకాదు సోష ల్ మీడియాలో తమపై వచ్చే వదంతలకు బ్రేక్ వేయడానికి కూడా తారలు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. శుభాకాంక్షలు, సంతాపాలు , ఎవరిని అయి నా అభినందించాలన్నా సరే ఇదే సరైన మార్గంగా భావిస్తున్నారు. మరోవైపు తారలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వారి ద్వారా తమ ప్లాట్‌ఫామ్‌ను మెరుగుపరుచుకోవాలని కొన్ని కార్పోరేట్ సంస్థలు చూస్తున్నాయి. ఇటీవల సామాన్యులకు సైతం అందుబాటు లోకి వచ్చిన ఓటీటీ ద్వారా తారల ఇళ్లలో జరిగే శుభకార్యాలను ఇవీ కొనుగోలు చేస్తున్నాయి. అడిగినంత చెల్లిస్తున్నాయని అంటున్నారు.
తారలకు సంబంధించి ప్రతిది వార్తే. ముఖ్యంగా వారి పెళ్లి తంతుకు ప్రత్యేకత ఉంటుంది. సామాన్యుల ఇంట పెళ్లి అంటే.. ఒకటి రెండు రోజు ల్లో ముగిసే తంతు.. కానీ, సెలబ్రిటీ-ల ఇంట జరిగే పెళ్లి ఇప్పుడు టీ-వీ, ఓటీ-టీ- ప్రసార హక్కులదాకా వెళ్తోంది. ఇది బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్‌కి చేరింది. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లికి కూడా ఇలాగే జరిగింది. వీరి పెళ్లి అంగరంగ వైభ వంగా జరగగా అనేక మంది సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే.. ఈ పెళ్లి వేడుక హక్కులను నెట్‌ప్లిnక్స్ తీసుకుని ప్రసారం చేసింది. ఇటీవలే హన్సిక, సోహైల్ పెళ్లి వీడియో డిస్నీప్లస్ హాట్ స్టార్ ప్రసారం అవుతోంది. ఓటీటీ సంస్థలు తారలు అడిగినంత ఇస్తున్నాయి కాబట్టి పెళ్లి, లేదా నిశ్చితార్థ ప్రసార హక్కులను పొందుతున్నాయి. వీక్షకులు సైతం ఆసక్తిగా తిలకిస్తారు. దీనివల్ల తమ చందాదారులు సైతం పెరుగుతుంటారు. అంతేకాదు కార్పోరేట్ ప్రకటనల ద్వారా ఆదాయం ఉంటుంది. ఇంకా స్టార్ సెలబ్రిటీ-లు అయితే తమ పెళ్లి వీడియోల్ని పెద్ద పెద్ద ఓటీ-టీ- సంస్థలకి అమ్ముకుంటు-న్నారు. భవిష్యత్తులో తారల పెళ్లి వేడుకలే కాదు ఇతర సెలబ్రిటీల శుభకార్యక్రమాలను లైవ్‌గా కూడా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేరుంటే సంపాదన అనేక మార్గాల ద్వారా వస్తుందన డానికి ఇదే ఉదాహారణ.