అహ్మదాబాద్ – గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలసి దీపావళి వేడుకలు చేసుకున్నారు.
కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు మోడి బోటులో చేరుకున్నారు. సైనిక దుస్తుల్లో వచ్చిన మోడి.. భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ భౌగోళిక ప్రాంతంలో విధులు నిర్వహించడం చాలా క్లిష్టతరమైనది. పగలు అత్యధిక వేడి, రాత్రుళ్లు అత్యధిక చలి ఉంటుంది.
కాగా , 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి మోడి ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. దళాలతో ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోడి తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2022లో కార్గిల్‌లో, గతేడాది చైనా సరిహద్దులోని లేప్చా (హిమాచల్‌ప్రదేశ్) సైనిక శిబిరంలో వేడుకలు చేసుకున్నారు