నా భార్యకి..అలాగే ప్రపంచంలోని ప్రతి మహిళకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని తెలిపారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మీ శక్తి సామర్ధ్యాలు, మొక్కవోని దీక్ష, నిబద్ధత ఎప్పటికీ కొనసాగుతాయి. మీ విజయాలను ఈ ప్రపంచం జరుపుకుంటుందని ట్వీట్ చేశారు మహేశ్ బాబు. మహేష్ బాబు సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు విపరీతమైన మహిళా అభిమాన గణాన్ని కలిగి ఉన్నారు. ఇప్పటికీ ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు. మహేష్ బాబు జీవితంలో నమ్రత శిరోద్కర్ కీలక పాత్ర వహిస్తున్నారు. అర్ధాంగిగా, ఆంతరంగిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అటు ఫ్యామిలీ బాధ్యతలు ఇటు వ్యాపార దక్షత నెరవేరుస్తున్నారు. మహేష్ చేసే వ్యాపారాలన్నీ నమ్రత ఆలోచన నుండి పుట్టినవే. ఆదర్శ భార్యతో పాటు తల్లి అయిన నమ్రత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంది. తర్వాత మహేష్ బాబు కెరీర్ బాధ్యత తీసుకొని, సూపర్ స్టార్ గా ఎదగడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. 18 ఏళ్ళుగా మహేష్-నమ్రతల దాంపత్యం ఆదర్శవంతంగా కొనసాగుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement