Saturday, November 23, 2024

Delhi | ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐటీవో బ్రాంచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నాగాలాండ్ భవన్ చీఫ్ రెసిడెంట్ కమిషనర్ ఐఏఎస్ జ్యోతి కలాష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఈఎస్ ఉపాధ్యక్షులు ఎస్.ఎ. ఆలీషా, సెక్రటరీ ఎస్. ఈశ్వర్ ప్రసాద్, ట్రెజరర్ వి. ఛటర్జీలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తమ కుటుంబంలో చాలామంది ఉపాధ్యాయ వృత్తికి చెందిన వారేనని జ్యోతి కలాష్ చెప్పుకొచ్చారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రుల పాత్ర వంటి అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల్లోని ప్రతిభను తొలుత గుర్తించేది గురువులేనని అన్నారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సూచించారు. విద్యార్థుల్ని సొంత పిల్లల్లా భావించి దిశానిర్దేశం చేయాలని ఆయన చెప్పారు.

విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో డా. దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్మారక ఉన్నత పాఠశాల, పుష్పవిహార్ బ్రాంచ్ డా. కె. రమేష్ బాబు స్మారక ఉన్నత పాఠశాల, జనక్‌పురి బ్రాంచ్ ఎన్టీ రామారావు స్మారక ఉన్నత పాఠశాల, ప్రసాద్ నగర్ బ్రాంచ్ డా. బి.వి. నాథ్ & టి.ఆర్. రావు స్మారక ఉన్నత పాఠశాల, ఆర్కే పురం ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement