Sunday, January 19, 2025

Ceasefire l పాలస్తీనియన్ల విడుదలకు ఓకే – రేపు 737 మందికి విముక్తి

ప్రకటించిన ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం
గాజా సీజ్‌ఫైర్ రూల్స్ అమ‌ల్లోకి
ఇజ్రాయెల్ కేబినెట్ భేటీలో ఆమోదం
రేప‌టి నుంచి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం
ఇజ్రాయెలీల‌ను విడుద‌ల చేయ‌నున్న హ‌మాస్‌

టెల్‌ అవీవ్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌:
ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు సయోధ్య కుదరింది. ఇజ్రాయెల్ వ‌ద్ద‌ బందీలుగా ఉన్న‌వారి విడుదలకు మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడుతలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 737 మంది పాలస్తీనియా పౌరులను విడిచిపెట్టనున్నట్లు ఇజ్రాయెల్ శ‌నివారం ప్రకటించింది. దేశంలోని వివిధ జైళ్లలో బందీలు, ఖైదీలుగా ఉన్న‌వారిని విడుదల చేయనున్నట్లు ఆ దేశ న్యాయశాఖ ప్రకటించింది. వారిని ఆదివారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని, అందులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపింది. కాగా, గతంలో 95 మందిని విడుదల చేస్తున్నట్లు ఓ జాబితాను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు.

- Advertisement -

సీజ్‌ఫైర్‌ను ఆమోదించిన ఇజ్రాయెల్ కేబినెట్‌

అయితే హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్‌ శనివారం ఉదయం ఆమోదం తెలిపింది. దీంతో 737 మంది బందీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను హమాస్‌ ఇజ్రాయెల్‌కు అప్పగిస్తుంది. అదేవిధంగా, తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ విడుదల చేయనుంది. బందీల్లో తొలి బృందాన్ని ఆదివారం విడుదల చేయడంతో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement