Saturday, November 23, 2024

ఆనందయ్య మందుపై పరిశోధనలు ప్రారంభం.. 500మందికి ఫోన్లు

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో సంచలనంగా మారిన ఆనందయ్య కరోనా మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (CCRAS) పరిశోధనలు మొదలుపెట్టింది. అందులో మొత్తం నాలుగు దశల్లో ఆనందయ్య మందును విశ్లేషించనుండగా.. మొదటి దశలో భాగంగా మందు తీసుకున్న వారి అభిప్రాయాన్ని, వారి ఆరోగ్య స్థితిని తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి అప్పగించడం జరిగింది.

దీంతో విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి చెందిన వారు ఆనందయ్య దగ్గర ఇప్పటికే మందు తీసుకున్న కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారు. ఇందులో భాగంగా 500 మందికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న వైద్యులు.. ఆనందయ్య మందు తీసుకున్నాక ఆరోగ్య పరిస్థితిపై, తర్వాత ఉన్న పరిస్థితుల మీద ప్రస్తుతం ప్రత్యేకంగా ఓ నివేదికలో వివరాలను నమోదు చేస్తున్నారు. కాగా ఈ మొత్తం పరిశోధన పూర్తవడానికి నాలుగు నుండి ఐదు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement