సచివాలయంలో మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (శనివారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.