సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చని బోర్డు తెలియజేసింది. అలాగే cbse.gov.in, cbse.nic.inలో కూడా చెక్ చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
వాస్తవానికి సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాలు గత నెల 20నే విడుదల కావాల్సి ఉంది. ఆయా స్కూళ్లు మార్కుల జాబితాను పంపడంలో ఆలస్యం కారణంగా లేట్ అయింది. కరోనా వల్ల ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేశారు. గతవారం 12వ తరగతి ఫలితాలు విడుదల చేయగా.. తాజాగా పదో తరగతి ఫలితాలు వచ్చాయి.
ఈ వార్త కూడా చదవండి: ఊహించని ప్రమాదంతో మారిపోయిన వ్యక్తి ముఖం