Saturday, November 23, 2024

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ నెల 31లోగా ఫలితాలను వెల్లడించాలన్న సుప్రీంకోర్లు ఆదేశాల నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు ఈరోజు ఫలితాలను విడుదల చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్ఈ 10, 12 వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

దీంతో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 30 శాతం, 11 వ తరగతిలో మార్కుల ఆధారంగా 30 శాతం, 12వ తరగతిలో మిడ్ టర్మ్, ప్రీ-బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇలా మొత్తం 100 శాతానికి మార్కులను లెక్కించి ఫలితాలను సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను cbseresults.nic.in వెబ్‌సైటులో చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నెం, స్కూల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా క్వాలిఫైయింగ్ మార్కులు సాధించని విద్యార్థులను కంపార్మెంట్ కేటగిరీలో ఉంచనున్నారు. అయితే.. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని వారికి పరిస్థితులు చక్కబడ్డాక ఎగ్జామ్ రాసి వారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే బోర్డు తెలిపింది

ఈ వార్త కూడా చదవండి: సత్యదేవ్ ‘తిమ్మరుసు’ మూవీ రివ్యూ

Advertisement

తాజా వార్తలు

Advertisement