Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ TTD | తిరుమలలో సీబీఐ నేతృత్వంలోని సిట్ తనిఖీలు..

TTD | తిరుమలలో సీబీఐ నేతృత్వంలోని సిట్ తనిఖీలు..

0
TTD | తిరుమలలో సీబీఐ నేతృత్వంలోని సిట్ తనిఖీలు..

త్వరలోనే అత్యున్నతంగా న్యాయస్థానానికి నివేదిక సమర్పణ


తిరుమల : సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సిట్ చీఫ్ వీరేష్ ప్రభు, మురళి రంభలు శ్రీవారి ఆలయంలో పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. శ్రీవారి ఆలయంలోని లడ్డూ పోటు, ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు, నెయ్యి నిల్వ కేంద్రం, మార్కెటింగ్ గోడౌన్ లో తనిఖీలు నిర్వహించి నెయ్యి కాల్చి వ్యాపారంలో డాక్యుమెంట్స్ సేకరించింది సిట్ బృందం.

లడ్డూ తయారీ విధానం, నెయ్యి వినియోగం, ప్రసాదాల తయారీ, నెయ్యి సరఫరాతో పాటు ఇతర అంశాలపై ఆలయ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా టీటీడీ ప్రొక్యూర్మెంట్ లో అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోటు కార్మికులు, ప్రొక్యూర్మెంట్ సిబ్బందిని నెయ్యి కల్తీపై ప్రశ్నించినట్లు సమాచారం నిన్న తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో సిట్ బృందం కీలక సమావేశం నిర్వహించారు.

అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఈవో శ్యామల రావుతో సమీక్ష నిర్వహించారు. ఇక భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సిట్ ఆఫీస్ కు పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. అనుమతి లేనిదే ఎవరినీ భూదేవి కాంప్లెక్స్ లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version