Saturday, November 23, 2024

మణిపూర్‌పై సీబీఐ దర్యాప్తు షురూ.. వివస్త్రలైన మహిళల ఊరేగింపుపై ఎఫ్‌ఐఆర్‌

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనకు సంబంధించి వైరల్‌ అయిన వీడియో కేసుపై దర్యాప్తును సీబీఐ శనివారం ప్రారంభించింది. కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆదేశాలకు లోబడి ఐపీసీ సెక్షన్లు 153ఏ, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 మరియు 25(1-సి) ఏ యాక్టు కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.

కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేసారు. వీడియో తీసిన మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కస్టడీలో తీసుకొని విచారిస్తామని, బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేస్తామని, నేరం జరిగిన స్థలాన్ని పరిశీలిస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement