Tuesday, November 26, 2024

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ సాగింది. తమ వాదనలను జగన్, రఘురామ లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. అయితే తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోవడంలేదని సీబీఐ అధికారులకు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు రిజాయిండర్ కూడా వేశారు. తన కేసుల్లో తనతో పాటు నిందితులుగా ఉన్నవారికి జగన్ మేళ్లు చేశారని, సాక్ష్యులను బెదిరించేందుకు పలు మార్గాల్లో ప్రయత్నించారని రఘురామ వివరించారు. జగన్ బెయిల్ రద్దుకు ఈ కారణాలు సరిపోతాయన్నారు. ముఖ్యంగా జగన్‌కు బెయిల్ ఇవ్వడం వల్ల బాధితులుగా మారినవారిలో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: వైఎస్ఆర్‌పై జగన్ భావోద్వేగ ట్వీట్

Advertisement

తాజా వార్తలు

Advertisement