Wednesday, November 20, 2024

వివేకా హత్యపై సమాచారం ఇస్తే.. రూ.5 లక్షల నజరానా: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను విచారిస్తున్న సీబీఐ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది.

వివేకా హత్యపై సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement