పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్థిక కష్టాలకు కారణం మనమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ఇలా కావడానికి కారణం భారత్, ఆమోరికానో కాదని ఆయన వెల్లడించారు. పాక్‌లోని పాలనను శాసిస్తున్న సైనిక వ్యవస్థపై ఆయన తాజాగా పరోక్ష విమర్శలు చేశారు. 2018 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి, వారికి (ఆర్మీ) నచ్చిన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. దీంతో దేశం ఆర్థికంగా దివాలా తీసిందని, ప్రజలు కష్టాలపాలయ్యారని ఆరోపించారు. ఈమేరకు మంగళవారం తన పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.