Tuesday, November 26, 2024

Caught on camera: భారత సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు.. ఇవిగో ఆధారాలు!

భారత సరిహద్దుల్లో చైనా చొరబాట్లకు పాల్పడుతోంది. అంతేకాకుండా అక్కడ పక్కాగా నిర్మాణాలను చేపడుతోంది. దీనికి కొన్ని ఫొటోలను స్థానికులు సాక్ష్యాధారాలుగా సేకరించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లా నివాసితులు చగ్లగామ్‌లోని హడిగరా-డెల్టా 6 సమీపంలో కొన్ని ఫొటోలు తీశారు. చైనా PLA (పీపుల్స్ రిపబ్లిక్ ఆర్మీ) సిబ్బంది, భారీ యంత్రాలతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వీడియోలను రికార్డ్ చేశారు.  

అయితే.. ఈ వీడియో ఈ ఆగస్ట్ 11వ తేదీని రికార్డ్ చేశారు. స్థానికులు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. బీజింగ్ చొరబాటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో-చైనా సరిహద్దులో ఉన్న షి యోమి జిల్లాకు చెందిన మెచుఖా అనే గ్రామానికి చెందిన నివాసి చైనా LAC సమీపంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

మెచుఖా నివాసితులు గతంలో తమ పూర్వీకులు 1962 ఇండో-చైనా యుద్ధానికి ముందు టిబెట్‌ను సందర్శించేవారని, స్థానిక వస్తువులకు బదులుగా టిబెట్ నుండి ఉప్పు, బియ్యం, ఆభరణాల వ్యాపారం చేయడం ద్వారా వస్తుమార్పిడి విధానంలో నిమగ్నమై ఉన్నారని తెలియజేశారు. కానీ, ఇప్పుడు భారత సైన్యం అంతర్జాతీయ సరిహద్దు దగ్గరికి వెళ్లడానికి ఎవరినీ అనుమతించడం లేదు అంటున్నారు. భారతదేశం వైపు ఉన్న మౌలిక సదుపాయాలు చాలా దయనీయంగా ఉన్నాయని, పశ్చిమ సియాంగ్ జిల్లాలోని అలో పట్టణానికి మెంచుకాను కలిపే ఒకే రహదారి ఉందని తెలిపారు.

ఇక.. సరిహద్దులకు చేరుకోవడానికి చైనా నాలుగు లేన్‌ల రహదారిని పూర్తి చేయగా.. భారత సరిహద్దు రహదారి సంస్థ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. అక్కడున్న చిన్న ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండరని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపారు. మెంచుకాలో చిన్ని చిన్న సౌకర్యాలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మెరుగైన నెట్‌వర్క్ అవసరం ఉందని, ఇంటర్నెట్ సేవలు కల్పించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement