షిరిడి, ప్రభన్యూస్ః షిరిడిలో శ్రీ సాయి భక్త లక్ష్మీబాయి షిండే ట్రస్ట్, ఆర్ ఝన్‌జున్‌వాల్ శంకర్ ఐ ఆసుపత్రి పన్వెల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరాన్ని ముందుగా శంకర కంటి ఆసుపత్రి డాక్టర్ రాజేష్ కాప్సే , అయోధ్య హాస్పిటల్ డాక్టర్ ప్రశాంత్ గోండ్కర్, డా. సంతోష్ లోధా, రోటరీ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ పిజి గుంజాల్, షిర్డీ సిటీ ప్రెసిడెంట్ మజిద్ భాయ్ పఠాన్, నిఖిల్ బోరవ్కే, లయన్స్ క్లబ్ షిర్డీ సిటీ ప్రెసిడెంట్ సుభాష్రావ్ ఘుగే, మహేష్ వైద్య, సందీప్ గోండ్కర్, సురేఖ రణ్మలే చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
కంటి వైద్య శిభిరంలో షిర్డి, పరిసర ప్రాంతాలకు చెందిన 495మంది కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. అలాగే కంటి శుక్లం శస్త్రచికిత్స కోసం 45మందిని శంకర కంటి ఆసుపత్రి పన్వెల్ ముంబైకి రెఫర్ చేశారు. వీరికి ట్రస్ట్ తరుపున సేవ కొనసాగుతుందని ట్రస్ట్ ట్రస్టీ అరుణ్‌రావు షిండే-గైక్వాడ్ పాటిల్ తెలిపారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు ట్రస్టీ సంగీతా గైక్వాడ్ పాటిల్, సాయి9 గ్రూప్ డైరెక్టర్ సాయిరాజ్ గైక్వాడ్ పాటిల్ కృషి చేశారని తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో మరిన్ని సేవలు కొనసాగుతాయన్నారు. పేదలకు సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.