Wednesday, November 20, 2024

Cast Statistics – రేపటి నుంచి ఎపిలో ప్ర‌యోగాత్మ‌కంగా కుల‌గ‌ణ‌న సేక‌ర‌ణ‌….

అమ‌రావ‌తి – రేపటి నుంచి ఏపీలో కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా ఈ కులగణన ప్రక్రియను మొదలుపెట్టబోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయసిబ్బంది, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి డేటా సేకరిస్తారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన యాప్ ను కూడా తీసుకొచ్చింది. సేకరించిన డాటా మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలో యాప్ లోనే అప్లోడ్ చేస్తారు.ఇక ఈ కులగణన ప్రక్రియ రేపు మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభం అవుతుంది. ఈ కులగణన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.
రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ జరగనుంది. ఈనెల 22 వరకు కులగణన ప్రక్రియపై శిక్షణ ఉంటుంది.

కులగణనపై ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తారు. రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరుగుతాయి. దీనికి సంబంధించి ప్రాంతీయ సదస్సులను ఈ నెల 17న రాజమండ్రి కర్నూలులో నిర్వహిస్తారు. వీటితోపాటు ఈనెల 20వ తారీకున విశాఖపట్నం, విజయవాడలో, 24వ తేదీన తిరుపతిలో నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement