Tuesday, December 10, 2024

Cash Found – రాజ్య‌స‌భ‌లో తెలంగాణ ఎంపి సీటు వ‌ద్ద నోట్ల క‌ట్ట‌లు… విచార‌ణ‌కు ఆదేశం

న్యూ ఢిల్లీ – పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న రాజ్య‌స‌భ‌ లో భారీగా నగదు పట్టుబడింది. తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైనట్లు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్ ధన్‌ఖర్ తాజాగా వెల్లడించారు.


సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా గురువారం సభ వాయిదా పడిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు చైర్మన్‌ తెలిపారు. ఈ తనిఖీల్లో రూ.500 నోట్లతో ఉన్న నగదు కట్టను గుర్తించినట్లు చెప్పారు. సీటు నంబర్‌ 222 నుంచి భద్రతా అధికారులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ సీటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీనికి కేటాయించిందిగా గుర్తించినట్లు చైర్మన్‌ వెల్లడించారు.

ఈ అంశంపై విచారణకు ఆదేశించినట్లు ధన్‌ఖర్‌ వెల్లడించారు. మరోవైపు తాజా ఘటనపై కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అం శంలో సింఘ్వీ పేరును ప్రస్తావించడంపై మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ధ‌న్ ఖ‌డ్ విచార‌ణ‌లో అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement