Tuesday, November 26, 2024

వాట్సాప్ యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్

పేటీఎం, ఫోన్ పేలతో పోటీ పడేందుకు వాట్సాప్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో లీక్ అనే సంస్థ తెలిపింది. వాట్సప్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి యూపీఐ ద్వారా డబ్బులు పంపే యూజర్ల కోసం క్యాష్‌బ్యాక్ ఆఫర్లను తెస్తున్నట్లు తెలిపింది. ఒక్కసారి పేమెంట్ చేస్తే రూ.10 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ రావాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

కాగా వాట్సాప్‌ ఇటీవల వాట్సాప్‌ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామ్యంలో వాట్సాప్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను ఇండియన్‌ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆప్షన్‌ ను వినియోగించి యూజర్లు వాట్సాప్‌ ద్వారా 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్‌ ఫర్‌ చేసుకోవచ్చని వాట్సాప్‌ పేమెంట్‌ డైరక్టర్‌ మనేష్ మహాత్మే వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement