Tuesday, November 26, 2024

TS: బీపీ, షుగర్‌ కేసులు పెరుగుతున్నాయ్‌.. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయాలి : మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీపీ, షుగర్‌ కేసులు పెరుగుతున్నాయని, పరీక్షలు చేసి మందులు వాడితే ప్రమాదం తగ్గుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయాలని, ఈ ప్రాముఖ్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన వెల్లడించారు. నారాయణగూడలోని శ్వాస హాస్పిటల్స్‌ సిల్వర్‌ జూబ్లిd వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రాథమికదశలో పల్లె, బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ డయాగ్నస్టిక్‌ ద్వారా 57 రకాల ఉచిత పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 350 బస్తీ దవాఖానాల సేవలు చేరువ అయిన తర్వాత ఫీవర్‌, ఉస్మానియా ఇతర ఆసుపత్రుల్లో ఓపీకి వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిందన్నారు. గ్రామాల్లో సేవల కోసం పల్లె దవాఖాన ఏర్పాటు చేసి బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ చేసి వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement