యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేం సరయుపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సరయుపై చర్యలు తీసుకోవాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు చేపూరి ఆశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన హోటల్ ప్రమోషన్‌లో భాగంగా హిందువులను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్ ప్రచార సాంగ్‌లో సరయు ఇతరులు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించి మద్యం సేవించారని.. దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో కేసు నమోదు చేసిన సిరిసిల్ల పోలీసులు.. అనంతరం దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
బిగ్ బాస్ 5 తెలుగులో సరయు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్లకు ఈ బూతుల పాప గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సెవెన్ ఆర్ట్స్ అనే చానెల్ ద్వారా నెటిజన్లకు పరిచయమైన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.