జడ్జిలను దూషించిన కేసులో ముగ్గురిని కస్టడీకి తీసుకునేందుకు సీబీఐకి కోర్టు అనుమతించింది. మూడు రోజుల క్రితం ముగ్గురు నిందితులను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. గుంటూరులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తులు, న్యాయస్థానాల తీర్పులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న కేసులో నిందితులను రెండు రోజులపాటు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. మరింత లోతైన విచారణ కోసం కస్టడీ అవసరమని భావిస్తున్నట్లు సీబీఐ అధికారులు గుంటూరులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితులు మెట్ట చంద్రశేఖర్, కళానిధి గోపాలకృష్ణ, గంటా రమేష్ కుమార్లను సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. రెండు రోజుల పాటు నిందితులను సీబీఐ అధికారులు విచారించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital