తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కేసు నమోదు అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆయనపై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు చేశారు.
పోలీసులు హరీశ్ రావుపై 120బి, 386, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్ ఫోర్స్లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.
ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
- Advertisement -